10th Class Public Exams: ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా పరీక్షలు నిర్వహించాలి
![AP Tenth Public Examinations 2024](/sites/default/files/images/2024/03/09/ap-tenth-public-exams-2024-1709987102.jpg)
రాయచోటి: జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి జరిగే పదోతరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని డీఈఓ శివప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటిలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంవత్సరం పదోతరగతికి ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని, అందులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఒక్కొక్కటి 50 మార్కులకు ఉంటాయని చెప్పారు.
Entrance Test: గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
పరీక్షలలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా విద్యార్థులు స్వేచ్ఛగా భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఆనందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నపత్రాలు బయటకు పంపకుండా జాగ్రత్తలు చూసుకోవాలని తెలిపారు. మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రశ్నపత్రాల ట్రాన్స్‌పోర్ట్ సమయంలో, జవాబుపత్రాలు ప్యాకింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
TS DSC Recruitment With 11062 Posts: డీఎస్సీలో డీఎడ్ అర్హులకే ఎస్‌జీటీ పోస్టులు.. వారికి నో ఛాన్స్
డీసీఈబీ సెక్రటరీ కె.నాగమునిరెడ్డి మాట్లాడుతూ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు సమయానికి ప్రశ్నపత్రాలు అందించేలా చూడాలన్నారు. ఎస్.రామకృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరీక్ష విధానంపై అందరికీ అవగాహన కల్పించారు. ఏఎంఓ సుంకర రామకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Inter Paper Valuation: నేటి నుంచి ఇంటర్ పేపర్ వాల్యూవేషన్ ప్రారంభం