NET 2024 : నెట్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ వ‌య‌సు గ‌ల‌వారే అర్హులు

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ డిసెంబర్‌ –2024 పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్‌ నెలల్లో నిర్వహిస్తుంది. 

నెట్‌ అర్హత సాధిస్తే యూనివర్శిటీలు, కళాశాల స్థాయుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయవ­చ్చు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ఫెలోషిప్‌ లభిస్తుంది. 
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ–ఎన్‌సీఎల్‌/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అవసరం.
»    వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ట వయో పరిమితి లేదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండు పేపర్లు పేపర్‌–1, పేపర్‌–2 ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్‌–2లో 100 ప్రశ్నలు 200 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:10.12.2024
»    పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2024.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు సవరణ తేదీలు: 12.12.2024, 13.12.2024.
»    పరీక్ష తేదీలు: 01.01.2025 నుంచి 19.01.2025 వరకు
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.ac.in

AP Contract Employees Remove From Jobs : ఏపీలో భారీగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు.. కార‌ణం ఇదే..! 

#Tags