TS Junior Lecturer Exam Results 2024 Released : 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ప‌రీక్ష‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 పోస్టుల భర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన జూనియర్‌ లెక్చరర్ పరీక్ష ఫలితాలను జూలై 8వ తేదీన విడుదలయ్యాయి.

ఈ ప‌రీక్ష‌ను 2023 సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు. 

☛ 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ప‌రీక్ష‌ ఫ‌లితాల 2024 కోసం క్లిక్ చేయండి

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులను..
ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ జులై 8వ తేదీ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పోస్టులను జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 35 ప్రకారం కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జేఎల్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 3 ప్రకారం..,  జీవో నెంబర్ 35 ప్రకారం పోస్టులను రిజర్వేషన్ల వారీగా కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా సబ్జెక్టుల వారిగా రిజర్వేషన్ల వారీగా ఖాళీగా వివరాలను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

#Tags