TS Inter Admissions 2024-25 Date Extended : ఇంటర్ ప్ర‌వేశాల‌కు గ‌డువు పొడిగింపు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మొద‌టి సంవత్సరం ప్ర‌వేశాల గ‌డువును పొడిగించారు.

ఇంట‌ర్ మొద‌టి సంవత్సరం అడ్మిషన్లు 2024 –25  విద్యా సంవత్సరానికి గానూ గడువును  2024 జూలై 31వ తేదీ వరకు పెంచుతూ  తెలంగాణ ఇంటర్  విద్యా బోర్డు కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూలు జూన్ నెలాఖరుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం జులై నెలాఖరు వరకు అడ్మిషన్ల గడువు పొడిగిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నారు

ఇంటర్ ప్ర‌వేశాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags