Job with 34.40 Lakhs Package : త‌ల్లిదండ్రుల క‌ష్టాని ఫలితంగా యువ‌తి గెలుపు.. ఏకంగా 34.40 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం..!

చిన్న‌త‌నం నుంచే త‌ల్లిదండ్రులు ప‌డుతున్న క‌ష్టాల‌న్నీ క‌ల్లారా చూసి పెరిగారు ఇద్ద‌రు అక్కాచెల్లెలు. చ‌దువు పూర్తి చేయించేందుకే నాన్న సదిరెడ్డి ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఉద్యోగా ఎంతో క‌ష్ట‌ప‌డి ఫీజులు క‌ట్టి చ‌దివించారు. అమ్మ అంజ‌లి.. గ్రుహిణి. చెల్లి హరిప్రియ మెడిసిన్ చ‌దువుతున్న‌ప్ప‌టికీ, పెద్ద కూత‌రైన కృష్ణ‌వేణి.. ఇంజినీరింగ్ చ‌దువుతుంది. చ‌దువు పూర్తి చేసుకున్న‌ త‌న సీనియ‌ర్ల‌కే ఎటువంటి ఉద్యోగాలు ద‌క్క‌డం లేద‌ని కాస్త బాధ‌గా ఉన్న చ‌దువులో మాత్ర‌మే కాకుండా ఇత‌ర విష‌యాల్లో కూడా ముందుండాల‌ని నిర్ణ‌యించుకొని కంప్యూట‌ర్ కోడింగ్ నేర్చుకునేందుకు రోజుకు ఒక గంట పాటు కేటాయించేది. చివ‌రికి ఇదే త‌న‌కు స‌హాయంగా నిలిచింది. 

CA Ranker Success Story : సీఏలో తొలి ప్ర‌య‌త్నంలోనే రెండో ర్యాంకు.. ప్రిప‌రేష‌న్‌లో ఇవి త‌ప్ప‌నిస‌రి..!

అమ్మానాన్న‌ల క‌ష్టం..

నెల తిరిగేస‌రిక‌ల్లా ఇంటి అద్దే క‌ట్ట‌డం, క‌ళాశాల‌ల ఫీజులు, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటికి నాన్న ఒక్క‌రే క‌ష్ట‌ప‌డ‌డం చిన్న‌ప్ప‌టినుంచి చూస్తూ పెరిగింది కృష్ణ‌వేణి. అయితే, త‌న తండ్రికి స‌హాయంగా ఉండేందుకు, ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు త‌న కూడా ఎంతోకొంత సంపాదించాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకు చ‌దువుకునే స‌మ‌యంలో కోడింగ్‌, ఏఐ నైపుణ్యాలు, కొత్తగా వ‌చ్చి చాట్‌జీపీటీ లోంచి కొత్త విష‌యాల‌ను తెలుసుకుంది.

KNR School Students : కేఎన్‌ఆర్‌ విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లో..

రూ.34.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం..

ఇంజినీరింగ్ విద్య కొన‌సాగుతుండ‌గా క‌ళాశాల‌లో జ‌రిగిన క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో పే-పాల్ అనే సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. వారు కృష్ణ‌వేణి నైపుణ్యాలను మెచ్చ‌గా త‌ను రూ. 34.40 ల‌క్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఇక దీంతో ఇంటి క‌ష్టాలు, త‌ల్లిదండ్రులు ప‌డే క‌ష్టాలు తీరిపోతాయ‌ని సంతోషించింది. దీంతో ఎంత‌టి క‌ష్టాన్నైనా ఇష్టంగా చూస్తే ఎదైనా సాధించ‌వ‌చ్చు అని నిరూపించింది.

APRCET Exam Results 2024: ఏపీఆర్‌ సెట్‌లో స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ సాధించిన భానురేఖ..

#Tags

Related Articles