44,228 Postal GDS Result Release Date 2024 : ఏక్ష‌ణంలోనై 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు ఫ‌లితాలు విడుద‌ల‌.. వెరిఫికేష‌న్‌కు కావల్సిన సర్టిఫికేట్స్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎటు వంటి రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ లేకుండా.. కేవలం టెన్త్ ప‌రీక్ష‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వ‌చ్చే ఉద్యోగాల్లో పోస్టల్ జీడీఎస్ ఒక‌టి. అయితే ఇటీవ‌లే దేశ వ్యాప్తంగా 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇచ్చి.. ద‌ర‌ఖాస్తులు స్వీకరించిన విష‌యం తెల్సిందే. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫ‌లితాలు మాత్రం ఆగస్టు నెల చివ‌రిలో విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది

ఈ  ఉద్యోగాల‌కు ఎంపిక ఇలా..
మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ సమాచారం అందిస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి ఇచ్చిన‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, మెయిల్, పోస్టు ద్వారా సమాచారం వస్తుంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితాను పొందుపరుస్తారు. మొదటి సెలక్షన్‌ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్టును వెల్లడిస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదలకానుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

☛➤ 40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కావాల్సిన ప‌త్రాలు ఇవే..
☛➤ పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో 
☛➤ 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
☛➤ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌

☛➤ దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, మెడికల్‌ సర్టిఫికెట్‌
☛➤  అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు 
☛➤  ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌,  కుల ధ్రువీకరణ పత్రం,  ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం

#Tags