NEET UG 2024 Paper Leak Issues : నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవల నీట్, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా. రాష్ట్రపతి తన ప్రసంగంలో.. ప్రస్తావించారు.

ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాల‌న్నారు. ఇలాంటి ప‌రీక్ష‌లు పారదర్శకంగా జరగాల‌న్నారు. ఈ పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంద‌న్నారు. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

నీట్ పరీక్షలో అవకతవకలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని ఉభయ సభలనుద్దేశించి ముర్ము ప్రసంగించారు.

నీట్‌ పేపర్‌ లీకేజీ విష‌యంలో.. తొలి అరెస్టు..
నీట్‌ పేపర్‌ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్‌ కేంద్రంగా నీట్‌ పేపర్‌ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్‌ చేసింది. వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ (యూజీ)-2024 పరీక్షలో అవకతవకలపై దూమారం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది.

సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్‌ కుమార్ నీట్‌ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్‌ పేపర్‌ను 12 మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్‌ కుమార్‌ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్‌ పేపర్‌ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది.

#Tags