Father and Daughter Clears NEET UG 2024 Exam : ఈ తండ్రి చేసిన ప‌నికి షాక్ అవ్వాల్సిందే.. క‌న్న కూతురి కోసం ఏకంగా..

క‌న్న కూతురు విజ‌యం కోసం ఈ 50 ఏళ్ల తండ్రి పెద్ద సాహ‌స‌మే చేశాడు. కూతురు అటెన్షన్‌తో చదవాలని.. ఈయ‌న ఏకంగా 50 ఏళ్ల వయసులో ఆమె తోపాటు నీట్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు.

అతడిది ఇంజ‌నీరింగ్‌ బ్యాగ్రౌండ్‌.. అయినా సరే కూతురితో పోటీపడి మరీ చదివాడు. తన కూతరిని ఇన్‌స్పేర్‌ చేసేలా ప్రిపేరయ్యి మరీ విజయం సాధించాడు. అతడి కూతురు కూడా మంచి మార్కులతో ఈ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఈ నేప‌థ్యంలో తండ్రికూతురి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
ఆ తండ్రి పేరు వికాస్‌‌ మంగ్రోత్రా. ఆయన ఢిల్లీలో కార్పొరేట్‌ ఉద్యోగిగా పనిచేన్నారు. అతడికి 18 ఏళ్ల మిమాన్సా అనే కూతురు ఉంది. ఆయన తన కూతురు నీట్ యూజీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా చేసేందుకు ఓ తండ్రిగా ఈ ఏజ్‌లో చేసిన సాహసంగా చెప్పొచ్చు. 

☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

ఈ ఉద్దేశ్యంతోనే..
వికాస్‌ తన కూతరికి నీట్‌ ఎగ్జామ్‌లో పలు సందేహాలు తీర్చేవాడు. ఆమె కూతురు పడుతున్న టెన్షన్‌, ఇబ్బందులు చూసి.. ఆమెకు తానే స్పూర్తి కలిగించేలా చేద్దామన్న ఉద్దేశ్యంతో ఆమెతో కలిసి ఈ నీట్‌ ఎగ్జామ్‌కి ద‌ర‌ఖాస్తు చేశాడు. ఇద్దరు కలిసి పోటీపడి మరీ ప్రిపేరయ్యేవారు. నిజానికి వికాస్‌ 90లలో డాక్టర్‌ కావాలనుకుని ప్రీ మెడికల్‌ టెస్ట్‌లకు అప్లై చేశాడు. అయితే మార్కులు తక్కువ రావడం తోపాటు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇంజనీరింగ్‌ చదవాల్సి వచ్చింది. 

☛ Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

అయితే ఈ ఏడాది మాత్రం తన కూతురు కోసమే గాక తన సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలా ఈ నీట్‌ ఎగ్జామ్‌ రాసినట్లు వికాస్‌ చెప్పుకొచ్చారు. తన కూతురు ప్రిపరేషన్‌లో ఎదురయ్యే సందేహాలను తీరుస్తున్నప్పుడు వాళ్లు ఫీల్‌ అవుతున్న ఇబ్బందులును గ్రహించి.. ఎలా ఈ ఎగ్జామ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలో చెప్పాలనే ఉద్దేశ్యంతో కూతురి తోపాటు ప్రిపేర్‌ అయ్యానని అన్నారు.

☛ Inspirational Success Story : ఇలాంటి నాన్న కూడా ఉంటారా..?

అంద‌రు ఆశ్చర్యపోయేలా..
చివరికి ఇద్దరూ ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆయన తన కూతురుని ఎగ్జామ్‌లో బాగా ప్రిపేర్‌ చేసేందుకు ఒక ఏడాది పాటు సెలవులు పెట్టిమరీ ప్రిపేర్‌ చేయించారు. ఇక ఆయన కూడా ఆఫీస్‌ పనివేళ్లలు పూర్తి అయిన తర్వాత కొద్ది గంటలు ఈ ఎగ్జామ్‌కి కేటాయించి మరీ ప్రీపేర్‌ అయ్యినట్లు తెలిపారు. 

అయితే వికాస్‌ నీట్‌ ఎగ్జామ్‌ని 2022లో కూడా అటెంప్ట్‌ చేశానని అలాగే యూపీఎస్సీ, జేకేసెట్‌, సీఎస్‌ఈ వంటి ఇతర పరీక్షలు కూడా సరదాగా రాసేవాడినని చెప్పుకొచ్చారు. అంతేగాదు మన పిల్లలు పాఠ్యాంశాలు బాగా చదివేలా తల్లిదండ్రులుగా మనమే ముందుకొచ్చి సహకరించాలని అన్నారు. ఈ తండ్రి త‌న కూతురు కోసం చేసిన ప‌ని.. నేడు ఎంతోమందికి స్పూర్తి కలిగించేలా ఉంది.

☛ NEET 2023 Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

#Tags