NEET UG Revised Results: విడుదల చేయలేదు: కేంద్రం

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ 2024 రివైజ్డ్‌ ఫలితాలను జూలై 25న‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసిందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది.

రివైజ్డ్‌ ఫలితాలను విడుదల చేయలేదని, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో షేర్‌ అవుతున్న లింక్‌ పాతదేనని స్పష్టం చేసింది. ఫిజిక్స్‌ పేపర్‌లోని ఓ ప్రశ్నకు రెండు రకాలైన సమాధానాలకు కూడా మార్కులు వేశారు.

చదవండి: NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

దీనిపై కొందరు విద్యార్థుల వినతిమేరకు సుప్రీంకోర్టు విచారణ కమిటీని వేయడం, ఆ ప్రశ్నకు ఒక్కటే సరైన సమాధానమని కమిటీ స్పష్టం చేయడం తెల్సిందే. దీంతో, రెండు రోజుల్లోగా రివైజ్డ్‌ ఫలితాలను ప్రకటిస్తామంటూ విద్యాశాఖ ప్రకటించింది.  

#Tags