NEET: నీట్‌ను రద్దు చేయండి

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ జూలై 25న‌ మూడు కీలక తీర్మానాలను ఆమోదించింది. నేషనల్‌ ఎంట్రన్స్‌ కమ్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నీట్‌)ను రద్దు చేయాలి, ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం, 2026లో చేపట్టే జనగణన ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరింది.

చదవండి: NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

పునర్‌వ్యవస్థీకరణను 1971 జనగణన ఆధారంగానే చేపట్టాలని కోరింది. జమిలి ఎన్నికల విధానం అమలుతో దేశ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం ప్రమాదంలో పడతాయని పేర్కొంది.

#Tags