యూపీఎస్సీ సీఏపీఎఫ్ నోటిఫికేషన్-2020 వాయిదా

సాక్షి, ఎడ్యుకేషన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మడ్ పోలీస్‌ఫోర్స్-అసిస్టెంట్ కమాండెంట్) 2020 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది.
సీఏపీఎఫ్ నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల కావాల్సి ఉంది. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. యూపీఎస్సీ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం- సీఏపీఎఫ్ ప్రాథమిక పరీక్ష ఆగస్ట్ 9న జరగాల్సి ఉంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు 250, 200 మార్కులు కలిగిన రెండు పేపర్ల రాతపరీక్షకు హాజరు కావాలి. రాతపరీక్ష పాసైన అభ్యర్థులు ఫిజికల్ స్టాండర్డ్స్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్: https://www.upsc.gov.in