ఆ విద్యార్థులను ప్రమోట్ చేసే విషయంపై స్పష్టత ఇవ్వండి

సాక్షి, అమరావతి: ‘కరోనా కారణంగా ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులకు నేరుగా తరగతులు జరగలేదు. ఆన్లైన్లో పాఠాలు చెప్పారు.
పరీక్ష విధానం కూడా మార్చారు. అందువల్ల తొలి ఏడాది ఎంబీబీఎస్‌ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో చాలామంది ఫెయిలయ్యారు. వీరిని సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేయమంటూ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వండి’ అని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డా.శ్యాంప్రసాద్‌ జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కి లేఖ రాశారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ప్రమోట్‌ విషయాన్ని పరిశీలించాలని లేఖలో కోరారు.