విద్యాలయాల్లో ‘సెల్ఫ్‌ డైరెక్టెడ్‌ లెర్నింగ్‌’ కోర్సులు

సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో భయం, ఒత్తిడితో యువత మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది.
ఈ నేపథ్యంలో వారి చదువులు ముందుకు సాగించేందుకు వీలుగా సామాజిక భావోద్వేగాలకు అనుగుణంగా అభ్యసన విధానాలను విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చేలా యూజీసీ కొత్త కోర్సుల అమలుకు అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు సూచనలు జారీచేసింది. యూఎస్‌ఏలోని లైఫ్‌ యూనివర్సిటీ, యునెస్కో పరిధిలోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ (ఎంజీఐఈపీ) రూపొందించిన ‘కాంప్రహెన్సివ్‌ ఇంటెగ్రిటీ ట్రయినింగ్‌ సెల్ఫ్‌ డైరెక్టెడ్‌ లెర్నింగ్‌(సీఐటీ–ఎస్‌డీఎల్‌) కోర్సులు అమలుపై పరిశీలన చేయాలని ఆయా విద్యాసంస్థలకు సూచించింది. జాతీయ నూతన విద్యావిధానం–2020లో పేర్కొన్న విధంగా 2021 శతాబ్దపు ‘ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌’ను ఈ కోర్సులు పెంపొందిస్తాయని తెలిపింది. యువత తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇవి ఉపకరిస్తాయంది. సీఐటీ–ఎస్‌డీఎల్‌ కోర్సులకు సంబంధించి ఇతర అంశాలకు యునెస్కో ఎంజీఐఈపీ సీనియర్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ను ఈ మెయిల్‌ (ఎ.సీఏఐఎన్‌ఈఎట్‌దరేట్‌యునెస్కో.ఓఆర్జీ) ద్వారా సంప్రదించాలని సూచించింది.