విద్యాభివృద్ధికి ‘అక్షరభూమి’

జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకుగాను ప్రభుత్వానికి తోడుగా సహాయం చేయడానికి అక్షరభూమి ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండ చంద్రయ్య తెలిపారు.
జనవరి 10 (శుక్రవారం)న మంచిర్యాల జిల్లా జన్నారం మం డలం తిమ్మాపూర్‌లో అక్షర భూమి ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫౌండేషన్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలు, ఎంఈవోలు, పాఠశాల హెచ్‌ఎంలను సభ్యులుగా భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అరుున తిమ్మాపూర్‌లో మొదటిసారిగా ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నామని, ఈ సందర్భంగా రూ.లక్ష విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఈవో వెంకటేశ్వర్లుకు చెక్కు అందించారు. ఈ ట్రస్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తారిస్తామని పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి అధికారి ఇలా అక్షర భూమి ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్నారు.