తెలుగు వర్సిటీ ప్రవేశాలకు గడువు 21.. లేకపోతే ఇతరులకు అవకాశం..
నాంపల్లి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21వ విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఈ నెల 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాలని విశ్వవిద్యాలయం సెంట్రల్ అడ్మిషన్ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జనవరి 11, 12వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు నిర్దేశించిన గడువులోగా అడ్మిషన్ తీసుకోకపోతే ఇతరులకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు.