సంవత్సరాల వారీగా జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కులు

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్-2020లో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్-అగ్రవర్ణ పేదలు) విద్యార్థులకు ఒకింత మేలు చేకూరనుంది.
జేఈఈ మెయిన్‌లో ఈసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో కటాఫ్ తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఎన్‌ఐటీ, తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి మెయిన్‌లో కనీస అర్హత మార్కులు రావాలి.

జేఈఈ అడ్వాన్స్ డ్ 2020 సిలబస్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.

ఆయా సంస్థల్లోని సీట్లు, రిజర్వేషన్లు, తదితరాల ఆధారంగా కనీస అర్హత మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తారు. ఈ కటాఫ్ ఆధారంగా మెయిన్ పరీక్షలో మెరిట్‌లో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్ నిర్వహించి మెరిట్ ర్యాంకులు సాధించినవారికి ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఆయా కేటగిరీల్లోని వారికి వచ్చిన పర్సంటైల్ ఆధారంగా కటాఫ్‌ను ప్రకటించారు. ఈ కటాఫ్ ఓబీసీల కంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తక్కువగా ఉండడం విశేషం.

Must Check: JEE Mians 2019 Opening and Closing Ranks|

ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు గతేడాది కంటే అధికం
ఎన్‌టీఏ ప్రకటించిన ఫలితాల ప్రకారం చూస్తే.. గతేడాది (2019) కంటే ఈసారి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ అధికంగా ఉంది. ఇతర వర్గాలకు కటాఫ్ తగ్గింది. జేఈఈ కటాఫ్ మార్కు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్వాలిఫయింగ్ కటాఫ్ కాగా, మరొకటి అడ్మిషన్ కటాఫ్. కటాఫ్ మార్కులను బీఈ, బీటెక్, బీఆర్కిటెక్చర్ కోర్సులకు వేర్వేరుగా నిర్ణయిస్తారు. క్వాలిఫయింగ్ కటాఫ్ ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐ (గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్)లలో ప్రవేశానికి అర్హత సాధించడానికి సంబంధించింది. అడ్మిషన్లకు సంబంధించిన కటాఫ్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియను అనుసరించి విడతల వారీగా నిర్ణయిస్తారు.

సంవత్సరాల వారీగా జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కులు ఇలా..

సంవత్సరం

జనరల్

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఈడబ్ల్యూఎస్

పీడబ్ల్యూడీ

2020

90.3765335

72.8887969

50.1760245

39.0696101

70.2435518

0.0618524

2019

89.75

74.31

54.01

44.33

78.21

0.1137

2018

74

45

29

24

-

35

2017

81

49

32

27

-

-

2016

100

70

52

48

-

-

2015

105

70

50

44

-

-

2014

115

74

53

47

-

-