ఫీజులు తిరిగి వెనక్కు ఇవ్వకపోతే... ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 28న జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... 2019-20కి సంబంధించి మనం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి, పిల్లల కోసం ఫీజులు కట్టి ఉంటే.. కాలేజీ యాజమాన్యాలు తల్లులకు ఆ ఫీజులు వెనక్కు ఇవ్వాలి.
ఈ మేరకు వాళ్లకు లేఖలు రాశాం. వలంటీర్ల ద్వారా ఆ లేఖలు అందుతాయి. ఒకవేళ ఎక్కడైనా ఫీజులు తిరిగి వెనక్కు ఇవ్వకపోతే తల్లులకు రాసిన లేఖలో పేర్కొన్న 1902 నంబరుకు ఫోన్ చేయండి. ప్రభుత్వమే స్పందించి ఆ మొత్తాన్ని మీకు ఇప్పిస్తుంది.