ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్- 2 ఫలితాలు విడుదల
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్ 2 ఫలితాలను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం బుధవారం విడుదల చేసింది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రేస్ మార్కులు కలిపిన అనంతరం ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ పి.దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ ఫలితాలపై రీటోటలింగ్ కోరే విద్యార్థులు సబ్జెక్ట్‌కు రూ.2 వేలు చెల్లించి 24లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.