ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు ఆగస్టు 30 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయంతో పా టు విదేశాలకు వేళ్లేందుకు వీసా, ఒక ప్రయాణ చార్జీ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆసక్తి ఉన్న వి ద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 30లోగా నిర్ణీత ఫార్మాట్‌లో అన్నిరకాల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

చ‌ద‌వండి: తెలంగాణ పాలిసెట్‌ – 2021 స్లాట్‌ బుకింగ్‌కు చివరి తేదీ ఆగస్టు 9

చ‌ద‌వండి: ఇక ఇంటర్, డిగ్రీలలో ద్వితీయ భాషగా ‘సంస్కృతం’.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌..