నూతన విద్యా విధానంతో పాఠశాల విద్యలో కొత్త మార్పులు: ఇకపై మూడు రకాల పాఠశాలలు
భానుగుడి (కాకినాడ సిటీ): జగనన్న అమ్మ ఒడి.. జగనన్న విద్యా కానుక.. ఉచిత పాఠ్య పుస్తకాలు.. జగనన్న విద్యా దీవెన.. వసతి దీవెన.. మన బడి నాడు – నేడు.. ఇంగ్లిషు మాధ్యమం.. ఇలా మునుపెన్నడూ చూడని అనేక వినూత్న సంక్షేమ పథకాలతో బడుగుల విద్యలో నూతన ఒరవడి తెచ్చిన సీఎం వైఎస్ జగన్ మరో నవశకానికి నాంది పలుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నూతన విద్యా విధానం (5+3+3+4) ప్రవేశపెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలతో పాఠశాల విద్యను పట్టాలెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అంగన్‌వాడీ.. ఇక ప్రీ ప్రైమరీ..
జిల్లా వ్యాప్తంగా 5,546 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో మూడేళ్లలోపు చిన్నారులు 1,55,153 మంది ఉన్నారు. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,19,346 మంది ఉన్నారు. వీరందరూ ఇక నుంచి నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యనభ్యసించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాల సముదాయాల్లో ఉన్న, సముదాయాలకు వేరుగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి, వాటి నిర్వహణకు విద్యా శాఖ, ఐసీడీఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్ల వయస్సు చిన్నారులు 1.19 లక్షల మంది ఉన్నారు. 4,221 ప్రభుత్వ పాఠశాలల్లో 4.5 లక్షలు, ఆరు వేల ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 8.69 లక్షల మంది విద్యార్థులు నూతన విద్యా విధానంలోకి అడుగు పెట్టనున్నారు.
పాఠశాలలు ఇక మూడు రకాలు
నూతన విద్యావిధానంతో పాఠశాలలను మూడు రకాలుగా వర్గీకరించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ–1, 1, 2 తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా, 3, 4, 5 తరగతుల పాఠశాలలను ప్రిలిమినరీ పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. ఫౌండేషన్, ప్రిలిమినరీ పాఠశాలలను ఒకటిగా గుర్తిస్తారు.
6, 7, 8 తరగతులను మిడిల్ స్కూళ్లుగా గుర్తిస్తారు. వీటిని హైస్కూళ్లుగా పిలుస్తారు.
9 నుంచి 12వ తరగతి వరకూ సెకండరీ స్కూళ్లుగా ఉంటాయి.
ఇంటికి సమీపంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు, కిలోమీటర్ పరిధిలో ఫౌండేషన్ పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాలలు ఉండేలా స్కూళ్లు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం విద్యార్థుల వయస్సును సైతం నిర్ధారించింది.
కచ్చితంగా అమలు చేయాల్సిందే
గత పాలకుల వైఫల్యం కారణంగా ఇప్పటి వరకూ ఈ విధానం అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం పాఠశాల విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నందున కొత్త పథకాలు, కొత్త విధానాలు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రస్తుతం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు కలపడం వలన చిన్న తరగతి 3గా ఉండి పెద్ద తరగతి 10గా ఉండి విద్యార్థుల మధ్య అంతరం ఎక్కువగా ఉంటుంది. దీనివలన పాఠశాల నిర్వహణ కష్టతరమవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి.
– చెవ్వూరి రవి, అధ్యక్షుడు, ప్రధానోపాధ్యాయుల సంఘం
పాఠశాల విద్యకు మహర్దశ
నూతన విద్యావిధానంతో రాష్ట్రంలోని పాఠశాల విద్యకు మహర్దశ పట్టనుంది. ఈ నాలుగంచెల విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది. బడుగుల విద్యకు ప్రభుత్వం ఇప్పటికే పలు విధాలుగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల విద్య పట్ల ఒక విజన్‌తో ముందుకు కదులుతున్నారు.
– ఆర్.నరసింహారావు, ఆర్‌జేడీ, పాఠశాల విద్య
ఈ విద్యా సంవత్సరం నుంచే..
ప్రభుత్వ సూచనల ప్రకారం ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యావిధానం అమలుకు అన్ని సన్నాహాలూ చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించినందున ప్రస్తుతం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయి. దేశమంతటా ఒకే విధానం అమలు కావడం స్వాగతించదగిన విషయం. అన్ని తరగతుల విద్యార్థులూ ఒకే గొడుగు కిందకు వచ్చినట్లవుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు హిందీ, ఇంగ్లిష్, తెలుగు టీచర్లు అందుబాటులోకి వస్తారు. దీనివలన విద్యార్థులకు మేలు జరుగుతుంది.
– ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి
హర్షిస్తున్నాం
నూతన విద్యావిధానంతో పాఠశాల విద్య రూపురేఖలు మారతాయి. భవిష్యత్తులో ఈ విధానంతో సంచలనాలు ఆవిష్కృతమవుతాయనడంలో సందేహం లేదు. పీఆర్‌టీయూ ఈ విధానాన్ని పూర్తిగా స్వాగతిస్తోంది. ఈ ఏడాదే అమలుకు శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తున్నాం.
– పీఎన్‌వీవీ సత్యనారాయణ, ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త, పీఆర్‌టీయూ (102)

పాఠశాల విద్యార్థి | వయస్సు | తరగతి |
ప్రీ ప్రైమరీ, ప్రిపరేటరీ | 3 – 8 ఏళ్లు | పీపీ–1, పీపీ–2, 1, 2 |
ప్రిలిమినరీ పాఠశాలలు | 8 – 11 ఏళ్లు | 3, 4, 5 |
మిడిల్ స్కూళ్లు | 11 – 14 ఏళ్లు | 6, 7, 8 |
సెకండరీ స్కూళ్లు | 14 – 18 ఏళ్లు | 9, 10, 11, 12 |