మైనార్టీ గురుకులాల్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలు...
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కాలేజీలు.... గురుకులాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇస్తూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు తీర్చిదిద్దే కేంద్రాలు.
ఇవి ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల్లో కొనసాగుతున్నాయి. వీటితో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఇలాంటి విద్యాలయాలు మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో కూడా ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంకల్లా పది సీవోఈలను తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఐదు సీవోఈలు బాలికల కోసం, మరో ఐదు సీవోఈలు బాలుర కోసం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గతవారం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన సొసైటీ పాలక మండలి సమావేశంలో తీర్మానించారు.
మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులతో...
జూనియర్ కాలేజీలకు సమాంతరంగా సీవోఈలను నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తూనే ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకంగా సీవోఈల్లో శిక్షణ ఇస్తారు. వచ్చే ఏడాదికల్లా పది సీవోఈ లను ప్రారంభించాలని సొసైటీ భావిస్తుండటంతో అందుకు సంబంధించి వ సతులు, సౌకర్యాలపై దృష్టి సారించా రు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2021– 22 విద్యాసంవత్సరంలో తొలుత ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. మైనార్టీ గురుకుల విద్యాసంస్థ ల్లో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థు లకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతాక్రమంలో వీటిల్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో కాలేజీలో కోర్సుకు 60 సీట్లు ఉంటాయి. మొత్తంగా 240 మందితో వీటిని ప్రారంభిస్తారు.