జేఈఈ మెయిన్–2021 మార్చి సెషన్ లో ఏపీ టాపర్లు వీరే..

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 మార్చి సెషన్ పేపర్‌–1 (బీఈ, బీటెక్‌) పరీక్షల ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో ఎన్టీఏ 100 స్కోరు సాధించిన విద్యార్థులు 13 మంది ఉండగా అందులో ఏపీ విద్యార్థులకు స్థానం దక్కలేదు. ఇతర కేటగిరీల్లో 10 మంది విద్యార్థులు మంచి స్కోరు సాధించి ముందంజలో ఉన్నారు.

చదవండి: జేఈఈ మెయిన్‌ మార్చి సెషన్‌ కటాఫ్‌ ఎక్కువుండే అవకాశం..

రాష్ట్రాల వారీ టాపర్స్‌ జాబితాలో ఏపీ నుంచి అనుమోలు వినాయక్‌ ఖన్నా (99.9978) అగ్రస్థానంలో ఉన్నాడు. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో గుంటుపల్లి ఆశిష్‌ సాయి (99.9946), సోము హితేష్‌ (99.9934), కరణం లోకేష్‌ (99.9892)లు అగ్రస్థానంలో నిలిచారు. ఓబీసీ–ఎన్సీఎల్‌ కేటగిరీలో బిత్రి సాయి సిద్ధి రఘురామ్‌ శరణ్‌ (99.9924), ఎస్సీ కేటగిరీలో జనపాటి వర్షితదేవి (99.9791), కల్వల వివేక్‌ (99.9742)లు మంచి స్కోరు సాధించారు. దివ్యాంగ విభాగంలో ఇప్పిలి తస్విన్ (99.63), తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణ (99.26) స్కోరు సాధించారు. ఇక బాలికల కేటగిరీలో తేలు అమృత వర్షిణి (99.9871) అగ్రస్థానం దక్కించుకున్నారు. మార్చి 16 నుంచి 18 వరకు జరిగిన ఈ పరీక్షలకు 6,19,638 మంది రిజిస్టర్‌ అయ్యారు. మొత్తం దేశవ్యాప్తంగా, విదేశాల్లో కలిపి 334 నగరాల్లోని 792 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.