గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 25,724 మంది హాజరు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 167 కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరిపారు. గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతికి 14,900 సీట్లు ఉండగా 31,758 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 25,724 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి.నవ్య మాట్లాడుతూ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం విద్య, ఆహారం, ఆరోగ్యం, భద్రత కల్పిస్తోందన్నారు.