‘దోస్త్‌– 2021’ ఫస్ట్‌ ఫేస్‌కు ఆగస్టు 12 వరకు దరఖాస్తు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసు తెలంగాణ (దోస్త్‌) ఫస్ట్‌ ఫేజ్‌ దరఖాస్తుకు ఆగస్టు 12 వరకు గడువు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు.
ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 10,008 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, 9,193 మంది దరఖాస్తులు దాఖలు చేశారని పేర్కొన్నారు. సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్‌కు గడువు ఆగస్టు 18వ తేదీగా వెల్లడించారు.