డిసెంబర్9 నుంచి వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్: వ్యవసాయవర్సిటీ
రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బైపీసీ స్ట్రీమ్ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం డిసెంబర్9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ 432 సీట్లు, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ 130 సీట్లకు, బీవీఎస్సీ, ఏహెచ్ 158 సీట్లకు, బీఎఫ్ఎస్సీ 36 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిం చి నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.pjtrau.edu.in లో లాగిన్ కావాలని తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ పేమెంట్ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.