బదిలీలు ముగిశాయి.. మార్పుల్లేవు: విద్యాశాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున టీచర్ల స్థానాల్లో మార్పులు, చేర్పులకు ఎలాంటి ఆస్కారమూ ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఎన్నికల దృష్ట్యా కోడ్‌ ఆఫ్‌ కాండక్టు వల్ల నిలిచిన బదిలీలు మినహా మరే ఇతర స్థానాల్లోను మార్పులు ఉండబోవని పేర్కొంది. అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ స్థానాల్లో మార్పు కోరుతూ అందించే వినతులను, సిఫార్సు పత్రాలను కమిషన రేట్‌ కార్యాలయానికి పంపరాదని రాష్ట్రంలోని ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. అలా వినతులు అందించే ఉపాధ్యాయులకు ఈ విషయాలను రాతపూర్వ కంగా తెలియచేయాలని సూచించారు.