ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్ల అప్‌లోడ్ గడువును జనవరి 7 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్‌బాబు వెల్లడించారు.
జనవరి 10, 11 తేదీలలో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను జనవరి 15న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన చలానా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో జనవరి 18 నుంచి 22 లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, జనవరి 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.