అగ్రి సెట్- 2020 ఫలితాలు విడుదల
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ -2020 ఫలితాలను వైస్ చాన్స్ లర్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు శుక్రవారం విడుదల చేశారు.
రెండేళ్ల అగ్రికల్చర్ డిప్లొమా, మూడేళ్ల అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతీఏటా అగ్రి సెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్‌ను నిర్వహిస్తోంది.