ఆదాయంలో మనోళ్లు నెం.1: అమెరికన్ కమ్యూనిటీ సర్వే

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల.

దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.

అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా..

ఇండియన్

1,00,500

ఫిలిప్పో

83,300

తైవానీస్

82,500

శ్రీలంకన్

74,600

జపనీస్

72,300

మలేసియన్

70,300

చైనీస్

69,100

పాకిస్తాన్

66,200

వైట్-అమెరికన్లు

59,900

కొరియన్

59,200

ఇండోనేసియన్

57,500

స్థానిక-అమెరికన్లు

56,200

థాయ్‌లాండ్

55,000

బంగ్లాదేశీ

50,000

నేపాలీ

43,500

లాటినో

43,000

ఆఫ్రికన్ -అమెరికన్లు

35,000


బ్యాచిలర్ డిగ్రీలోనూ మనమే..
భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.

ఇండియన్ - అమెరికన్లు

70%

కొరియన్ - అమెరికన్లు

53%

చైనీస్ - అమెరికన్లు

51%

ఫిలిప్పో - అమెరికన్లు

47%

జపనీస్ - అమెరికన్లు

46%

సగటు అమెరికన్లు

28%