2 రకాలుగా హెచ్‌సీయూ ఎంబీఏ అడ్మిషన్లు

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2021–22 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సుల్లో రెండు రకాలుగా అడ్మిషన్లు కల్పిస్తామని యూనివర్సిటీ అధికారులు మంగళవారం తెలిపారు.
ఎంబీఏ (జనరల్‌ రెగ్యులర్‌) కోర్సులో క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తామని చెప్పారు. అలాగే ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌), ఎంబీఏ (హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌), ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లను యూనివర్సిటీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష అనంతరం నిర్వహించే గ్రూపు డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా కల్పిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.

చ‌ద‌వండి: సెప్టెంబర్‌ 12న నీట్‌ యూజీ– 2021 పరీక్ష

చ‌ద‌వండి: ‘సంస్కృతం’ సెకండ్‌ లాంగ్వేజ్‌గా ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరణ!

చ‌ద‌వండి: ‘మనూ– 2021’ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు జూలై 17 వరకు పెంపు