Work From Home: కంపెనీల కీలక నిర్ణయం ఇదే..
అయితే భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఈ లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS).. దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతోంది.
ఆఫీసులకు వచ్చేందుకు..
టీసీఎస్‌కు యాభై దేశాల్లో 250 లొకేషన్లలో ఆఫీసులు ఉన్నాయి. సుమారు ఐదు లక్షల ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో భారత్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మంది కనీసం ఒక్కడోసు వేయించుకున్నారు. ఇదీగాక ఎంప్లాయిస్ ఫీడ్‌బ్యాక్ సర్వేలో సగం మందికిపైగా తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారట. అందుకే ఆఫీసులకు రావాలని కోరుతున్నామని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణియం చెబుతున్నారు.
2025 వరకు...
వీలైనంత త్వరగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారాయన. అయితే హైబ్రిడ్ వర్క్ మోడల్ తమ పరిశీలనలోనూ ఉందని, 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని నడిపించే దిశగా టీసీఎస్ ప్రణాళిక వేస్తోందని, అయితే 2025 వరకు అది అమలు కావొచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారాయన.