RRB NTPC Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌..ఇండియ‌న్ రైల్వే 3445 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌... పూర్తి వివ‌రాల కోసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియ‌న్ రైల్వే ఇటీవ‌ల కాలంలో వివిధ ర‌కాల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తుంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న‌ రైల్వే జోన్లలో 3445 పోస్టుల భ‌ర్తీకి సెప్టెంబ‌ర్ 21వ తేదీన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్‌ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ పోస్టులను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. 

అక్టోబర్‌ 20వ తేదీలోపు...
ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌)లకు సంబంధించి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. వివిధ పోస్టులను అనుసరించి ఇంటర్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 20వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 18 ఏళ్ల‌ నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వ‌యోప‌రిమ‌తి సడలింపు ఉంటుంది.

అర్హత ఇవే.. : 
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల వివ‌రాలు ఇవే..
➤☛ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
➤☛ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
➤☛ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
➤☛ ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
☛ మొత్తం పోస్టులు : 3,445.

ఈ పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే...
 

#Tags