RRB Group D jobs Notification 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. 32,000 గ్రూప్-D పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త‌లు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇస్తున్న విష‌యం తెల్సిందే. అయితే రైల్వే శాఖ ఇప్పుడు నిరుద్యోగుల‌కు మ‌రో భారీ గుడ్‌న్యూస్ చెప్పింది.

దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్‌-డి ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఈ ఉద్యోగాల‌కు ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 ఉంటుంది.

అర్హ‌త‌లు ఇవే..
ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల‌ను జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీన వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250/- ద‌ర‌ఖాస్తు ఫీజు ఉంటుంది. 01-07-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల‌ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది.

ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌తోనే.. ఈ ఉద్యోగాలు..
పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప‌రీక్ష విధానం : 
ఈ ఉద్యోగాల‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

RRB 32,000 గ్రూప్‌-డి ఉద్యోగాల పూర్తి వివ‌రాల కోసం https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281 ఈ లింక్ క్లిక్ 

#Tags