TGPSC Group 2 Exams Hall Tickets 2024 : గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల తేదీ ఇదే.. పరీక్షల సమయం ఇలా...
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లలను డిసెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లలను www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి టీఎస్‌పీఎస్సీ కమిషన్ సూచించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ సందేహాలు పంపవచ్చని పేర్కొంది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష సమయం ఇదే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.డిసెంబరు 16వ తేదీన పేపర్ 3, 4 పరీక్షలను ఇదే సమయంలో నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు.
TSPSC Group 2 Exam Hall Ticket 2024 Downoad చేసుకోండిలా...
1. అధికారిక టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
2. గ్రూప్-2 హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి.
3. ఓటీపీఆర్ నెంబర్, పాస్‌వర్డ్ నమెదు చేయండి.
4. మరో పేజీలో గ్రూప్-2 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..