Chess Championship: జాతీయ అండర్-13 చెస్ చాంపియన్‌షిప్ విజేత శరణ్య దేవి

37వ జాతీయ అండర్-13 బాలికల చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అమ్మాయి శరణ్య దేవి నరహరి విజేతగా నిలిచింది.

శరణ్య 9 పాయింట్లతో స్థానాన్ని పొందింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శరణ్య 8 గేముల్లో గెలిచి, రెండు గేమ్లను 'డ్రా' చేసుకొని, ఒక గేమ్ లో ఓడిపోయింది. శరణ్యకు విన్నర్స్ ట్రోఫీ తోపాటు రూ.80 వేలు ప్రైజ్‌మ‌నీ లభించింది.

ఇందులో..  తమిళనాడుకు చెందిన వీసీ నివేదితా రెండో స్థానంలో, మహారాష్ట్రకు చెందిన నిహిరా కౌల్ మూడో స్థానంలో నిలిచారు.  

అండర్-13 పురుషుల చెస్ చాంపియన్‌షిప్‌లో.. బిహార్‌కు చెందిన ఎండీ రేయాన్ విజేతగా, మహారాష్ట్రకు చెందిన ప్రథమేశ్ శెర్లా రెండో స్థానంలో, తమిళనాడుకు చెందిన ప్రసన్న సాయి రామ్ మూడవ స్థానంలో నిలిచారు.

Asian Youth Championship: ఆసియా యూత్‌ చాంపియన్‌సిప్‌లో జ్యోష్నకు పసిడి పతకం

#Tags