Most Medals in Paralympics: భారత పారాలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు

ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు.

2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. సెప్టెంబ‌ర్ 4వ తేదీ పోటీలు ముగిసేసరికి భారత్‌ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి.  

➣ పురుషుల హైజంప్ ఈవెంట్‌లో శరద్ కుమార్ రజతం, మరియప్పన్ తంగవేలు కాంస్యం సాధించారు. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్‌ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. 

➣ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అజీత్ సింగ్ రజతం, సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నారు. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్‌ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు.  

➣ పురుషుల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. 
 
➣ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 ఈవెంట్‌లో భారత ఆటగాడు సచిన్‌ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు.

Paris Paralympics: శ‌భాష్‌.. భారత్‌ ఖాతాలో చేరిన మరో గోల్డ్ మెడల్

#Tags