Asian Championship: తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల వాల్ట్‌ ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది.

30 ఏళ్ల దీపా 13.566 పాయింట్ల సగటుతో టాప్‌లో నిలిచి ఈ ఘనత సాధించింది. ఇందులో దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ సన్‌ హయంగ్‌ రజతం, జొ క్యోంగ్‌ బయోల్‌ కాంస్య పతకాలు సాధించారు. 

2015లో ఇదే ఈవెంట్‌లో దీపా, అదే సంవత్సరంలో ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో ఆశిష్‌ కుమార్ కాంస్య ప‌త‌కం సాధించారు. అలాగే 2019, 2022లో వాల్ట్‌ ఈవెంట్‌లో ప్రణతి నాయర్‌ కాంస్య పతకం సాధించింది. డోపింగ్‌లో పట్టుబడి 21 నెలల నిషేధానికి గురైన దీపా.. ఈ విజయంతో పునరాగమనం చాటుకుంది.

IPL 2024: ఐపీఎల్‌-17 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే..!

#Tags