Dhyan Chand Award: ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు పేరు మార్పు..

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పేరిట ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పేరును మార్చింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కవిత సెల్వరాజ్‌కు అవార్డు(ఫైల్‌ ఫొటో)

ఆటగాళ్లు తమ కెరీర్లో కనబరిచిన విశేష సేవలకు గుర్తింపుగా 2002 నుంచి ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డును ప్రదానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఇకపై ‘అర్జున లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డుగా అందజేయనున్నారు.

ఈ పురస్కారం ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులకు అందించేందుకు అనుగుణంగా ఉంది. 2023లో మంజూష కన్వర్‌ (షట్లర్‌), వినీత్‌ కుమార్‌ (హాకీ), కవిత సెల్వరాజ్‌ (కబడ్డీ)లకు ఈ అవార్డు అందించబడింది.

ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14 వరకు గడువు ఉంది. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో యూనివర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో ఓవరాల్‌ విజేతకు మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీ ఇవ్వబడుతుంది. అందుకు తోడు ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా ఉంటాయి. 

Women’s T20 World Cup Winners: మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతల జట్లు ఇవే..

#Tags