Food Processing Unit: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా తెలంగాణ

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం దండుపల్లిలో జ‌న‌వ‌రి 30వ తేదీ రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌పూరితో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా ఆవిర్భవిస్తోందని కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు.  

Sir Chhotu Ram Award: సీఎం కేసీఆర్‌కు ‘సర్‌ ఛోటూ రామ్‌’ అవార్డు

కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. 
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.  
20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌..
పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ కోసం ప్రత్యేకంగా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. 

Amazon Web Services: తెలంగాణలో అమెజాన్‌ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.36వేల కోట్లు

#Tags