Skip to main content

Sir Chhotu Ram Award: సీఎం కేసీఆర్‌కు ‘సర్‌ ఛోటూ రామ్‌’ అవార్డు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు ‘సర్‌ ఛోటూ రామ్‌’అవార్డును ప్రకటించారు.

పంజాబ్‌ రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన సర్‌ ఛోటూ రామ్‌ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. జ‌న‌వ‌రి 5న ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు అందజేశారు.  
ఎవరీ సర్‌ ఛోటూ రామ్‌?
స్వాతంత్య్రానికి పూర్వం వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్న పంజాబ్‌ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్‌ ఛోటూ రామ్‌ 1934లో పంజాబ్‌ రిలీఫ్‌ అప్పుల చట్టం, 1936లో పంజాబ్‌ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషి చేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్‌ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత హరితవిప్లవంతో స్వామినాథన్‌ పంజాబ్‌ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత తమను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆరేనని పంజాబ్‌ రైతులు మంత్రితో అన్నారు.

Telangana: అటవీ విస్తీర్ణంలో తెలంగాణకు రెండోస్థానం

Published date : 06 Jan 2023 12:45PM

Photo Stories