జనవరి 2019 రాష్ట్రీయం
కియాలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమలోని ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి షిన్‌బాంకిల్, కియా అధ్యక్షుడు, సీఈవో పార్క్, కియా ఎండీ షిమ్‌తో కలిసి ఈ ప్రయోగాత్మక ఉత్పత్తిని జనవరి 29న ప్రారంభించారు. ఏపీలో కియా ప్లాంట్ ఏర్పాటుకు 2017 ఏప్రిల్ 27న ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం 536 ఎకరాల్లో ఏర్పాటుచేసిన చేసిన కియా ప్లాంట్ ద్వారా ఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నామన్నారు. సెప్టెంబరు, అక్టోబరులో కియా వాణిజ్య ఉత్పత్తి మొదలవనుంది.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా పార్క్...
దక్షిణకొరియాలో ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఏపీ అంబాసిడర్‌గా కియా అధ్యక్షుడు పార్క్‌ను నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు...
అనంతరపురం జిల్లా ఖదిరి మండలం చెర్లోపల్లి హంద్రీనీవా రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు జనవరి 29న నీళ్లు వదిలారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవాను అనుసంధానం చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కియాలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కియా కార్ల పరిశ్రమ, ఎర్రమంచి, పెనుకొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ ఆర్‌అండ్‌డీ సెంటర్
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్.. హైదరాబాద్‌లో అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ పరిశోధన మరియు అభివృద్ధి (ఏఐ-ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఐటీ అండ్ ఈసీ విభాగంతో జనవరి 30న ఒప్పందం చేసుకుంది. కేంద్రం ద్వారా ఫాక్స్‌కాన్ గ్రూప్‌కు స్మార్ట్ మ్యానుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేవలందించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాక్స్‌కాన్ ఏఐ-ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ఫాక్స్‌కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్
ఎక్కడ : హైదరాబాద్
చిత్తూరులో ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ (ఐడీటీఆర్)’ కేంద్రం ఏర్పాటుకానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు ఐడీటీఆర్ కేంద్రాన్ని మంజూరుచేస్తూ జనవరి 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటుకు తిరుపతి- చెన్నై జాతీయ రహదారిపై నగరి మండలం తడుకు వద్ద 15ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేంద్రంలో చోదకులకు శిక్షణతోపాటు పరిశోధనలు చేపడతారు. ప్రకాశం జిల్లా దర్శిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐడీటీఆర్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీటీఆర్ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తడుకు, నగ రి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఏఐ ప్రారంభం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్)లో జనవరి 17న బీటెక్ ఏఐను ప్రారంభించారు. దీంతో ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ప్రత్యేక బ్రాంచ్‌గా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్‌ను అందించనున్న తొలి ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీహెచ్ నిలిచింది. అంతర్జాతీయంగా మూడో ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపుపొందింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్‌లో ఏఐ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బీటెక్ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ(యూఎస్)లే అందిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీటెక్ ఏఐ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎక్కడ : ఐఐటీ హైదరాబాద్
తెలంగాణలో కొలువుదీరిన రెండో అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ జనవరి 17న కొలువుదీరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా 119 మంది ఎమ్మెల్యే(ప్రొటెం స్పీకర్ మినహా)ల లో 114 మంది ప్రమాణం చేశారు. శాసనసభ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ వీరితో ప్రమాణం చేయించారు.
తెలంగాణ రెండో స్పీకర్‌గా పోచారం ఎన్నిక
తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జనవరి 18న బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. జనవరి 18 ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమైంది. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ వెంటనే తొలిరోజు ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమం కొనసాగించారు. అనంతరం స్పీకర్ ఎన్నికను ప్రకటించారు. ‘తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్ (టీఆర్‌ఎస్), వి.ఎం.అబ్రహం (టీఆర్‌ఎస్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ ఎస్), అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల(ఎంఐఎం), మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్) స్పీకర్ పదవికి శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు’ అని ప్రకటించారు. స్పీకర్‌గా శ్రీనివాస్‌రెడ్డిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. సభానాయకుడు, ఇతర పార్టీల నేతలు కలసి ఈ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ రెండో శాసనసభ ఎన్నిక
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎక్కడ: తెలంగాణ
ఏపీ 39 సిరీస్‌తో వాహన రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఒకే కోడ్ ఉపయోగించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ఏపీ 39 సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు చేయాలని జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆర్టీసీ బస్సులకు ‘జడ్’ సిరీస్, పోలీస్ వాహనాలకు ‘పి’ అనే సిరీస్‌ను ఉపయోగించనున్నారు. అలాగే రవాణా వాహనాలకు (ట్రాక్టర్లు, ట్రైలర్లు అన్నీ కలిపి) టి, యు, వి, డబ్ల్యు, ఎక్స్, వై సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు జరపనున్నారు. ఇప్పటివరకు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ కోడ్‌లు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ 39 సిరీస్‌తో వాహన రిజిస్ట్రేషన్లు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్
అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉండే వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 10న శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) ఈ గ్యాలరీని నిర్మించనుంది. 5 ఎకరాల్లో నిర్మించే ఈ గ్యాలరీని రోజుకు 2 వేల నుంచి 3వేల మంది సంద ర్శించవచ్చు. రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న అవకాశాలేమిటనే అంశాలను ‘వెల్‌కమ్ గ్యాలరీ’లో చూపించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సింగపూర్ సహకారంతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్
నెల్లూరు విమానశ్రయానికి శంకుస్థాపన
నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం దామవరం దగ్గర నిర్మించనున్న విమానశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 11న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏడాదిలో విమానశ్రయం పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
మరోవైపు ఏన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2000లకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తం 2019, జనవరి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళలు, 8,9,10 తరగతులు చదివే బాలికల ఆరోగ్య భద్రతకు రక్ష పథకం కింద శానిటరీ నాప్‌కిన్‌లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెల్లూరు విమానశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : దామవరం, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
కూచిపూడి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన
అమరావతిలో రూ.1,387 కోట్లతో నిర్మించనున్న కూచిపూడి ఐకానిక్ వంతెన సహా రూ.740.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీటి శుద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 12న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి వచ్చే వారికి కూచిపూడి నాట్యంతో స్వాగతం పలికేలా ఈ ఐకానిక్ బ్రిడ్జిని.. కూచిపూడి నాట్య భంగిమలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నదిపై అమరావతి అభివృద్ధి సంస్థ ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కూచిపూడి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత
తెలంగాణలో ముగ్గురు శాసనమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండిలి చైర్మన్ వి.స్వామిగౌడ్ జనవరి 16న ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హతకు గురైన వారిలో ఎస్. రాములు నాయక్, ఆర్. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తరఫున ఎన్నికై అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.
శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్
తెలంగాణ శాసనసభ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ జనవరి 16న ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఎస్. రాములు నాయక్, ఆర్. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డి
సులభతర వాణిజ్యంలో ఏపీకి అగ్రస్థానం
సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన ఆసియా కాంపిటీటివ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్(ఏసీఐ) కో- డెరైక్టర్ టాన్ ఖీ జియాప్ జనవరి 3న ఒక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటిస్థానంలో ఉండగా మహారాష్ట్ర, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణ 9వ స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం
ఎక్కడ : దేశంలో
కాకినాడ గేట్‌వే పోర్ట్ కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 4న శంకుస్థాపన చేశారు. రూ.3,000 కోట్ల వ్యయంతో డీబీఎఫ్‌ఓటీ (డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్) పద్ధతిలో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ నౌకాశ్రయం ద్వారా బొగ్గు, సాధారణ సరకులు, వంట నూనెలు, ముడి చమురు ఎగుమతి- దిగుమతులు జరిగే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ కు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : కోన గ్రామం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జీఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టీజీవీ గ్రూపు సంస్థ అయిన హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం జనవరివ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంప్లెక్స్ వల్ల రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ అంచనా. హల్దియా సంస్థ ఇప్పటికే బెంగాల్‌లోని హల్దియా వద్ద నాఫ్తా ఆధారిత అతిపెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఒప్పందం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఏపీ ప్రభుత్వం, హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్
ఎక్కడ : కాకినాడ సెజ్, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టుకు సీబీఐపీ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జనవరి 4న జరిగిన కార్యక్రమంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ అవార్డును అందజేశారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన పోలవరంను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నందుకు
సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ జనవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ
ఎక్కడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో రామాయపట్నం పోర్టుతోపాటు ఆసియా పేపర్, పల్ప్ (ఏపీపీ) కాగిత పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 9న శంకుస్థాపన చేశారు. రూ.4200 కోట్ల అంచనాలతో రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. అలాగే రూ.24,500 కోట్ల పెట్టుబడితో ఏపీపీని ఏర్పాటుచేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కందుకూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో డేటా పార్క్ ఏర్పాటు
విశాఖపట్నంలో పర్యావరణ హిత డేటా పార్క్, సోలార్ పార్క్‌లను ఏర్పాటుచేయనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఈ మేరకు జనవరి 9న ఏపీ ఐటీ శాఖతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల్లో ఒక గిగా వాట్ డేటా సెంటర్ (మూడు కేంద్రాలు), 5 గిగా వాట్స్ సోలార్ పార్క్‌ను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం భారతదేశంలో చెన్నై, ముంబయి నగరాల్లో మాత్రమే డేటా సెంటర్లు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డేటా పార్క్, సోలార్ పార్క్‌ల ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : అదానీ గ్రూప్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో పోషణ్ అభియాన్ పథకం
పిల్ల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘పోషణ్ అభియాన్’ పథకంను అమలు చేయనున్నట్లు డిసెంబర్ 26 తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2019, జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పోషణ్ అభియాన్‌ను ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోషణ్ అభియాన్ పథకం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
హైదరాబాద్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ ఏఐ కేంద్రం
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) కేంద్రంను ఏర్పాటుచేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉత్కర్ష్ ప్రసాద్ డిసెంబర్ 27న తెలిపారు. అలాగే దీర్ఘకాలంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో రీసెర్చ్‌కు పార్క్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఏఐ సెంటర్ ద్వారా ఏఐ రంగంలో శిక్షణనివ్వటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు పరిశోధన, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సేవలందించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐటీ ఖరగ్‌పూర్ ఏఐ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎక్కడ : హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి హైకోర్టు అంతర్థానమై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పడినట్లయింది. 2019, జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు వేటికవిగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు ఇకపై తెలంగాణ కోర్టుగా ఉండనుంది. ఏపీ హైకోర్టును అమరావతిలో ఏర్పాటుచేయనున్నారు.
అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటుచేశారు. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా, తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన 10 మంది న్యాయమూర్తులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా చెలామణి అవుతారు.
రెండు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు...
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ 2019, జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. అలాగే అమరావతిలో 2019, జనవరి 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
కడపలో నిర్మించనున్న ‘రాయలసీమ ఉక్కు పరిశ్రమ’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలంలోని ఎం.కంబాలదిన్నె వద్ద మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటుచేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఉక్కు పరిశ్రమకు మొదటి దశలో రూ.18వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత మలిదశలో రూ.15వేల కోట్లు పెడతామని, రెండుదశల్లో పదివేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఎం.కంబాలదిన్నె, మైలవరం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
కేటీపీఎస్ ఏడో దశ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడో దశ ప్లాంట్‌ను తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు డిసెంబర్ 26న ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ వస్తున్న కేటీపీఎస్ తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కేటీపీఎస్‌లో ఇప్పటివరకు ఉన్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ మూతపడిన తర్వాత) 1,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర గ్రిడ్‌కు రోజూ 2,460 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేటీపీఎస్ ఏడో దశ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
ఎక్కడ : పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
ఏపీలో తల్లి సురక్ష పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లి సురక్ష’ పథకంను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో డిసెంబర్ 30న ప్రారంభించారు. అలాగే ఏపీ-108 మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా సహజ ప్రసవానికి రూ.8వేలు, సిజేరియన్‌కు రూ.14,500 అందిస్తారు.ఇందుకోసం రూ.500కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది.
మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ కింద అందించే నగదు రహిత వైద్యసేవల పరిమితిని ఏడాదికి రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దీనికి అనుసంధానించి, దాని తరహాలోనే ఎన్టీఆర్ వైద్యసేవ కింద కూడా ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ నగదు రహిత వైద్యసేవలను అందించనుంది. 2019, ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తల్లి సురక్ష పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు
తెలంగాణ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టులో తన సహచర న్యాయమూర్తులు 12 మందితో రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు
ఎప్పుడు : జనవరి 1
ఎక్కడ : హైదరాబాద్
కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హైకోర్టును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
1961, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్‌కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2012, జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2013, డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు
ఎప్పుడు : జనవరి 1
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి జనవరి 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ షేడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా 12,732 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 1,13,170 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ ఎన్నికలు జనవరి 7-21 తేదీల మధ్య, 1-25 తేదీల మధ్యలో రెండో దశ, 16-30 మధ్యలో మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు దశల కింద మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్ రోజే ఫలితాలు వెలువరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ
శబరిమల ఆలయంలోకి మహిళలు
అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) జనవరి 2న ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కనకదుర్గ, బిందు

#Tags