Road Transport Corporation: ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. అంత్య‌క్రియ‌ల వ్య‌యం రూ.25 వేలకు పెంపు

ఆర్టీసీ ఉద్యోగులు, రెటైర్డ్ ఉద్యోగులు మ‌ర‌ణిస్తే.. వారి అంత్య‌క‌క్రియ‌ల కోసం మంజూరు చేసే మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేల‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ ఏపీఎస్ఆర్టీసీ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో చేసిన తీర్మానాన్ని అనుస‌రిస్తూ జూన్ 18వ తేదీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మ‌`తి చెందితే అంత్య‌క్రియ‌ల వ్య‌యం కింద రూ.15 వేల నుంచి రూ.25 వేల‌కు పెంచ‌డంతోపాటు ఆ నిర్ణ‌యాన్ని 2022 జ‌న‌వ‌రి 1 నుంచి రెట్రాస్సెక్టివ్‌గా అమ‌లు చేస్తామ‌ని కూడా ఆర్టీసీ పాల‌క‌మండ‌లి ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ నిర్ణ‌యించింది.

అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆర్టీసీ పాల‌క‌మండ‌లి రాజీనామా చేయ‌గా, ఆ పాల‌క మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తూ ఆర్టీసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2022 జ‌న‌వ‌రి 1వ తేదీ త‌ర్వాత మ‌ర‌ణించిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు ఇప్ప‌టికే రూ.15వేలు చొప్పున అందించి ఉంటే మిగిలిన రూ.10 వేలు కూడా త్వ‌ర‌లోనే వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేస్తారు. 

AP Schemes Name Changed: ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు.. మారిన పథకాల పేర్లు ఇవే..

#Tags