TET/DSC – ప్రత్యేకం | బయాలజీ (మొక్కల్లో ప్రత్యుత్పత్తి) Bitbank: ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు?
1. కవచ రహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు?
ఎ) లొరాంథస్
బి) ఆస్టరేసి
సి) ఒపన్షియా
డి) బెలనోఫోరా
1) ఎ, బి
2) బి, సి
3) బి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 4
2. మొక్కల కాండాల పై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడనివి?
1) ఆకులు
2) వేర్లు
3) శాఖలు
4) పుష్పాలు
- View Answer
- Answer: 2
3. ‘కోరకీభవనం’ అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం వీటిలో దేనిలో కనిపిస్తుంది?
1) మందార
2) వైరస్
3) గులాబీ
4) ఈస్ట్
- View Answer
- Answer: 4
4. కిందివాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి?
1) వరి
2) బఠాణీ
3) గోధుమ
4) జొన్న
- View Answer
- Answer: 2
5. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
1) మల్లె, జాజి – వికసించే సమయం రాత్రి
2) చామంతి, గన్నేరు – రంగుల పుష్పాలు
3) తామర, సూర్యకాంతం – వికసించే సమయం రాత్రి
4) మల్లె, విరజాజి– తెలుపు, సువాసన
- View Answer
- Answer: 3
6. ‘ఇకేబానా’ అనే మాట కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) పత్రాల అందమైన అమరిక
2) వేరుదుంపల అమరిక
3) ఫలాల అందమైన అమరిక
4) పువ్వుల అందమైన అమరిక
- View Answer
- Answer: 4
7. జిలేబీలను తయారుచేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు?
1) రైజోపస్
2) రైజోబియం
3) ఈస్ట్
4) లాక్టోబాసిల్లస్
- View Answer
- Answer: 3
8. కిందివాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కాదని తెలుస్తుంది?
1) ఆపిల్
2) జీడిమామిడి
3) టమోట
4) 1, 2
- View Answer
- Answer: 4
9. పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణ?
1) కరివేపాకు
2) బంగాళాదుంప
3) రణపాల
4) మామిడి
- View Answer
- Answer: 3
10. ద్వికక్షియుత పరాగకోశంలో ఉండే పుప్పోడి గదుల సంఖ్య
1) రెండు
2) ఆరు
3) నాలుగు
4) ఒకటి మాత్రమే
- View Answer
- Answer: 3
11. పరాగకోశంలో ద్వికేంద్రిక స్థితి కలిగిన కణాలు?
1) టపేటం
2) బాహ్య చర్మం
3) ఎండోథీషియం
4) పైవన్నీ
- View Answer
- Answer: 1
12. ఒక వివృత బీజ మొక్కల్లోని క్రోమోజోముల సంఖ్య 32 ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు, పరాగ కోశం, సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా
1) 16, 16, 32
2) 32, 32, 32
3) 32, 16, 16
4) 32, 32, 16
- View Answer
- Answer: 4
13. టెరిస్లో సంయోగ బీజ రకం?
1) సమ సంయోగ బీజం
2) విషమ సంయోగం
3) అసమ సంయోగ బీజం
4) ఇవేవీ కావు
- View Answer
- Answer: 3
14. కిందివారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు?
1) ప్లేటో
2) థియోప్రాస్టస్
3) జగదీష్ చంద్రబోస్
4) సోక్రటీస్
- View Answer
- Answer: 2
15. సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కంలోని కణాల స్థితి
1) ఏకస్థితిక
2) ద్వయస్థితిక
3) త్రయస్థితిక
4) బహుస్థితిక
- View Answer
- Answer: 1
16. ఒక విద్యార్థి తన పరిసరాల్లోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగ రేణువులు అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు. అయితే అవి చేరిన నిర్మాణం, ఆ రకానికి పేరు?
1) కీలం, పరాగ విసర్గం
2) కీలాగ్రం, పరపరాగ సంపర్కం
3) అండాశయం, పరాగ సంపర్కం
4) కీలాగ్రం, ఆత్మపరాగ సంపర్కం
- View Answer
- Answer: 4
17. కేశ గుచ్ఛం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం
1) ఫాబేసి
2) సిసాల్పినేసి
3) ఆస్టరేసి
4) లిల్లియేసి
- View Answer
- Answer: 3
18. సూక్ష్మ సిద్ధ బీజాల్లో ఎక్సైన్ అనేది
1) వ్యాధి జనకం
2) వ్యాధి కారకం
3) వ్యాధి నిరోధకం
4) ఇవేవీ కావు
- View Answer
- Answer: 1
19. విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక, ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండటాన్ని గమనించాడు. అటువంటి పుష్పం?
1) ద్విలింగ పుష్పం
2) అసంపూర్ణ పుష్పం
3) సంపూర్ణ పుష్పం
4) ఏకలింగ పుష్పం
- View Answer
- Answer: 2
20. పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి కిందివాటిలో దేనిపై జరుగుతుంది?
1) అండం
2) కీలం
3) కీలాగ్రం
4) పరాగనాళం
- View Answer
- Answer: 3
21. స్పోరోపొలెనిన్కు సంబంధించిన పదార్థం?
1. Mg
2. N
3. P2
4. NH3
- View Answer
- Answer: 2
22. పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం?
ఎ) పుష్పాలను ఎండిపోకుండా చూడటం
బి) పుష్పాల తాజాదనాన్ని పెంచడం
సి) ఫలాల రంగుకు తోడ్పడటం
డి) పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం
1) ఎ, బి
2) బి, సి
3) డి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- Answer: 3
23. టపెటమ్ అనేది కిందివాటిలో దేనిలో భాగం?
1) అండకోశం
2) అండం
3) పరాగకోశం
4) ఫలం
- View Answer
- Answer: 3
24. ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం, విత్తనాలు ఏర్పరచే పుష్ప నిర్మాణాలు వరుసగా ?
1) రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు
2) కేసరాలు, అండ కోశం
3) అండం, అండాశయం
4) అండాశయం, అండాలు
- View Answer
- Answer: 4
25. చింతకాయ విత్తనం పగుల కొడితే రెండు భాగాలుగా ఏర్పడేవి?
1) అండాలు
2) స్త్రీ బీజ కణాలు
3) బీజ దళాలు
4) సహæకణాలు
- View Answer
- Answer: 3
26. శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జత?
1) వేర్ల ద్వారా – గులాబీ
2) శాఖల ద్వారా – మందార
3) ఆకుల ద్వారా – కరివేపాకు
4) కాండం ద్వారా – వేప
- View Answer
- Answer: 2
27. తగినంత నీరు, గాలితోపాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది?
1) కాంతి
2) ఖనిజ లవణాలు
3) ఉష్ణోగ్రత
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
28. విద్యార్థి శాఖీయోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తికి కచ్చితమైన ఉదాహరణ నేర్చుకొని ఉంటే వీటిలో ఏది చదివి ఉంటాడు?
1) రణపాల మొక్క వేర్ల ద్వారా శాఖీ యోత్పత్తికి ఉదాహరణ
2) గులాబీ వేరు ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.
3) ఉల్లి వేర్లు శాఖీయోత్పత్తి జరుపుతాయి
4) కరివేపాకు వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది
- View Answer
- Answer: 4
29. కిందివాటిలో ఏ రెండు కుటుంబాల్లో పరాగ రేణువు నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగ నాళాలు వృద్ధి చెందుతాయి?
ఎ) లెగుమినేసి
బి) కుకుర్బిటేసి
సి) మాల్వేసి
డి) యుఫర్బియేసి
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 2
30. కిందివాటిలో అండకోశానికి సంబంధించనది?
1) ప్రతిపాదక కణం
2) ద్వితీయ కేంద్రకం
3) పరాగ కోశం
4) సహాయ కణం
- View Answer
- Answer: 3