Strong, united ASEAN: బలమైన, ఐక్య ఆసియాన్‌

  • అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్‌ నిర్ణయించాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి.  జూన్‌  16(గురువారం) ఢిల్లీలో జరిగిన ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు.
  • వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్‌– ఆసియాన్‌ తీర్మానించాయి. ఆసియాన్‌–భారత్‌ ట్రేడ్‌ ఇన్‌ గూడ్స్‌ అగ్రిమెంట్‌ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్‌)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.
#Tags