Saraswati Samman 2023: కేరళ కవి ప్రభ వర్మకు సరస్వతి సమ్మాన్
ప్రముఖ కేరళ కవి ప్రభ వర్మకు ‘సరస్వతి సమ్మాన్ –2023’ పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవలకు ఈ గౌరవం దక్కినట్లు కేకే బిర్లా ఫౌండేషన్ మార్చి 18న ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారంగా దీనిని పరిగణిస్తారు. ఈ పురస్కారాన్ని 1991లో ఏర్పాటు చేశారు. మలయాళంలో రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవల 2022లో ప్రచురితమైంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags