King Charles III: బ్రిటన్ రాజుగా చార్లెస్ ప్రమాణం
బ్రిటన్ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్-3 బాధ్యతలు స్వీకరించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్.. లండన్ లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా 'గాడ్ సేవ్ ద కింగ్' అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్-3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్‌బౌల్స్(75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సంతకాలు చేశారు. బ్రిటన్ తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్-3 అధినేతగా వ్యవహరిస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags