World Bank: ప్రపంచ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఇందర్మిత్‌ గిల్‌

ప్రపంచ బ్యాంక్‌.. తన ముఖ్య ఆర్థికవేత్తగా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇందర్మిత్‌ గిల్‌ను నియమించింది. కౌశిక్‌ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 201216 మధ్య బసు ఈ బాధ్యతలను నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి గిల్‌ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రపంచ బ్యాంకుకే చెందిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌)కి ముఖ్య ఆర్థికవేత్తలుగా రఘురామ్‌ రాజన్‌ , గీతా గోపీనాథ్‌లు సేవలందించారు. 

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags