Nirmala Sitharaman: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు స్థానం దక్కింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్(ర్యాంకు 89), హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్‌పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) ఈ జాబితాలో చోటు సాధించారు. 2022 ఫోర్బ్స్ లిస్టులో సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో మంత్రి జాబితాలో 37వ స్థానంలో 2020లో 41వ స్థానంలోనూ, 2019లో 34వ స్థానంలోనూ ఉన్నారు.
Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా సక్సెస్ సిక్రెట్ ఇదే..
#Tags