నవంబర్ 2020 జాతీయం
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణం
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : హుబ్బళ్లి ర్వేల్వే స్టేషన్, కర్నాటక
భారత్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ మ్యాప్‌ను ఆవిష్కరించిన ఐరాస సంస్థ?
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన విభాగాలకు సంబంధించి... ఇన్వెస్ట్ ఇండియా, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) సంయుక్తంగా ‘ఎస్‌డీజీ ఇన్వెస్టర్ మ్యాప్’ను నవంబర్ 20న ఆవిష్కరించాయి. స్థిరమైన అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యాలు నిర్దేశించుకున్న (ఎస్‌డీజీ)లో... ఆరు రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారమున్న 18 విభాగాలను (ఐవోఏ) పొందుపర్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సేవలు మొదలైనవి ఈ ఆరు రంగాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇన్వెస్ట్ ఇండియా ఎండీగా దీపక్ బాగ్లా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌డీజీ ఇన్వెస్టర్ మ్యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా, యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
ఎందుకు : భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి...
మిర్జాపూర్, సోన్‌భద్ర తాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో ఉన్న మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 22న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
గృహ సముదాయం...
పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 23న ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014-19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.5,555.38 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలు, ఉత్తరప్రదేశ్
ఎందుకు : వింధ్యాచల్ ప్రాంతంలో ఉన్న మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించేందుకు
ఎయిరిండియా వన్-బీ777 గగన విహారం ప్రారంభం
దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని నవంబర్ 24న ప్రారంభించింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ అందులో తొలి ప్రయాణం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఈ కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వన్‌బీ77 విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు.
బీ747-400 స్థానంలో...
ఎయిరిండియా వన్-బీ777లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు వీవీఐపీల కోసం వాడుతున్న బీ747-400 స్థానంలో ఈ కొత్త బీ777ను తీసుకువచ్చారు. ఈ విమానం అమెరికాలో సిద్ధమై 2020, అక్టోబర్ 1న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి కోసం మత మార్పిడిని నిషేధిస్తూ ఆర్డినెన్స్ తేనున్న రాష్ట్రం?
పెళ్లి చేసుకోవడం కోసం మత మార్పిడుల్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో నవంబర్ 24న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బలవంతంగా మతాన్ని మార్చడం కోసం మోసం చేసి ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం దారుణం అని, ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన అవసరం ఉందని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా మతం మారాలనుకుంటే వాళ్లు మారవచ్చునని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన ఆర్డినెన్స్ తేనున్న రాష్ట్రం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఉత్తరప్రదేశ్
ఎందుకు : పెళ్లి చేసుకోవడం కోసం మత మార్పిడుల్ని నిషేధించేందుకు
వారికి జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది: హైకోర్టు
మతంతో సంబంధం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉందని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. వివాహాల విషయంలో హిందువా, ముస్లిమా అన్నది న్యాయస్థానాలకు అవసరం లేదని, వారు మేజర్లా కాదా అన్నదే ముఖ్యమని జస్టిస్ పంకజ్ నక్వి వివేక్ అగర్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. సలామత్ అన్సారి, ప్రియాంక ఖర్వార్ అలియాస్ అలియా దంపతులు తమకు రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్ 24న విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆర్టికల్ 21 ప్రకారం...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇద్దరి మేజర్ల మధ్య వ్యక్తిగతంగా ఏర్పడే బంధాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ విలక్షణమైన స్వరూపానికే భంగం వాటిల్లుతుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఏమిటీ కేసు?
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కి చెందిన సలామత్ అన్సారి, ప్రియాంక ఖర్వార్‌లు 2019 ఆగస్టులో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే ప్రియాంక ఇస్లాం మతాన్ని పుచ్చుకొని తన పేరు అలియా అని మార్చుకుంది. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ ప్రియాంక తండ్రి సలామత్, మరికొందరిపై అప్పట్లోనే మైనర్‌ని వివాహం చేసుకున్నారంటూ కేసు పెట్టారు. ఆ కేసు కొట్టేయాలంటూ సలామత్, ప్రియాంక తాము మేజర్లమని వాదించారు.
యూనివర్సిటీ ఆఫ్ లక్నో స్మారక నాణేం ఆవిష్కరణ
ఉత్తరప్రదేశ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ లక్నో’ శతాబ్ధి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసం, ఆత్మసమీక్ష వంటి లక్షణాలను పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 1920 ఏడాదిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నోను స్థాపించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనివర్సిటీ ఆఫ్ లక్నో స్మారక నాణేం ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : యూనివర్సిటీ ఆఫ్ లక్నో శతాబ్ధి వేడుకల సందర్భంగా
పంజాబ్‌లో నూతన సైకిల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ?
ప్రముఖ సైకిల్స్ తయారీ సంస్థ ‘అవాన్ సైకిల్స్ లిమిటెడ్’ పంజాబ్‌లోని లుధియానా సమీప నీలన్ వద్ద నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అల్యూమినియం, స్టీల్ ఫ్రేమ్‌లు, పూర్తి సైకిళ్లను ఇక్కడ తయారు చేయనుంది. ప్రస్తుత, భవిష్యత్తు డిమాండ్‌ను తీర్చడంతోపాటు.. మాస్ ప్రీమియం, అత్యున్నత శ్రేణి ఉత్పత్తులను అందించడమే ఈ ప్లాంట్ ఏర్పాటు వెనుక ఉద్దేశమని కంపెనీ నవంబర్ 25న ఓ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : అవాన్ సైకిల్స్ లిమిటెడ్
ఎక్కడ : నీలన్, లుధియానా, పంజాబ్
ఏ వర్సిటీ క్యాంపస్‌లో వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జేఎన్‌యూ క్యాంపస్, న్యూఢిల్లీ
ప్రపంచ ఆయుర్వేద కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌వో ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది?
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్‌ఏ), రాజస్తాన్‌లోని జైపూర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను నవంబర్ 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్ ఒక వీడియో సందేశాన్ని పంపించారు.
టెడ్రోస్ సందేశం...
‘‘సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విసృ్తతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారత్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని నెలకొల్పబోతున్నాం. అన్ని దేశాల్లోనూ సంప్రదాయ వైద్య విధానాలకు మహర్దశ తీసుకురావడంలో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నాం’’ అని టెడ్రోస్ తన సందేశంలో పేర్కొన్నారు.
జాతీయ ఆయుర్వేద దినోత్సవం...
ఆయుర్వేద వైద్య మూలపురుషుడు ధన్వంతరి జయంతి రోజున(ధన్‌తేరస్) ప్రతి ఏడాది ‘‘జాతీయ ఆయుర్వేద దినోత్సవం’’ను నిర్వహిస్తున్నారు. 2016 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 2020 ఏడాదిలో నవంబర్ 13వ తేదీన ఈ దినోత్సవం జరిగింది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం దన్వంతరి జయంతి ఒక్కో ఏడాది ఒక్కో తేదీలో రావచ్చు. అందువల్ల ఈ దినోత్సవాన్ని ఏటా ఒకే తేదీన పాటించరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్
ఎక్కడ : భారత్
ఎందుకు : సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విసృ్తతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి
స్టాట్యూ ఆఫ్ పీస్‌ను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
‘స్టాట్యూ ఆఫ్ పీస్’(శాంతి విగ్రహం)పేరుతో నిర్మించిన ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, నవంబర్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. రాజస్తాన్ రాష్ట్రం, పాలీ జిల్లాలోని పాలీ పట్టణంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. విగ్రహావిష్కరణ అనంతరం మోదీ మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.
వోకల్ ఫర్ లోకల్...
దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు.
నేషనల్ ప్రెస్ డే...
కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నవంబర్ 16న నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశం ఇచ్చారు. ప్రతి ఏడాది మే 3వ తేదీని ఇంటర్నేషనల్ ప్రెస్ డేగా పాటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టాట్యూ ఆఫ్ పీస్(శాంతి విగ్రహం) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : పాలీ పట్టణం, పాలీ జిల్లా, రాజస్తాన్ రాష్ట్రం
ఎందుకు : ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా...
భారత ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్ట్ మౌసమ్ ముఖ్య ఉద్దేశం?
సముద్ర మార్గం ఆధారంగా భారతదేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’ పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి {పొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది.
ప్రాజెక్ట్ మౌసమ్-ముఖ్యాంశాలు
- ‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్ట్ మౌసమ్‌కు శ్రీకారం చుట్టింది.
- సముద్ర మార్గం ద్వారా మన దేశానికి-ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన నాటి చారిత్రక ఆధారాలను ఈ ప్రాజెక్టు ద్వారా వెలికి తీస్తారు.
- నాటి చారిత్రక వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చని ప్రభుత్వం పరిశీలించనుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది.
- ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు.
- మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్రం ఈ ప్రాజెక్టు ద్వారా చేస్తోంది.
దక్కన్ డయలాగ్-2020 సమావేశాన్ని నిర్వహించిన సంస్థ?
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) ఆధ్వర్యంలో నవంబర్ 16న దక్కన్ డయలాగ్-2020 వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది వాణిజ్య విధానం కాదని, బలమైన, స్వయంప్రతిపత్తి గల భారతదేశం వైపు మనల్ని నడిపించే వ్యూహమని మంత్రి అన్నారు. త్వరలోనే బహుళ రంగాలలో సహజ ప్రయోజనాలతో గ్లోబల్ ఎకనామిక్ ప్లేయర్‌గా భారత్ ఉద్భవిస్తుందన్నారు.
ఐఎస్‌బీలో...
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ఐఎస్‌బీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ బిజినెస్ అండ్ డిప్లొమసీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, హీరో ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్‌కాంత్ ముంజల్ తెలిపారు. ప్రస్తుతం ఐఎస్‌బీ డీన్‌గా ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ ఉన్నారు.
గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
గోవుల సంరక్షణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 18న ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో పాటుగా హోంమంత్రి నరోత్తమ్ , అటవీ శాఖ మంత్రి విజయ్ షా, వ్యవసాయ శాఖ మంత్రి కమల్, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర, పశుసంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ ఈ కేబినెట్‌లో ఉంటారు. గోపాష్టమిని పురస్కరించుకొని నవంబర్ 22న కేబినెట్ తొలి భేటి జరగనుంది.
గోవుల సంరక్షణతో పాటు ఆవు పాలతో తయారు చేసిన ఉత్పత్తులు, ఔషధ విలువలు కలిగిన గో మూత్రం, పిడకలు వంటి వాటి మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ కేబినెట్ పని చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గోవుల సంరక్షణను ప్రోత్సహించడం కోసం
స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్‌కు ఎంపికై న ఏకై క భారత స్మార్ట్ సిటీ?
స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్-2020 జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో నవంబర్ 18న మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. ‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరం మూడో స్థానంలో నిలిచింది. విశాఖ బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్-2020కు ఎంపికైన ఏకైక భారత సిటీ
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : విశాఖపట్నం
ఎక్కడ : బార్సిలోనా, స్సెయిన్
నౌకాదళ అమ్ములపొదిలోకి చేరిన అత్యాధునిక యుద్ధ విమానం?
దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానం ‘పొసిడాన్ 8ఐ(పీ8ఐ)’ భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరింది. అగ్రరాజ్యం అమెరికా రూపొందించిన ఈ విమానం నవంబర్ 18న గోవాలోని ఐఎన్‌ఎస్ హన్స నౌకా స్థావరంలో దిగింది. ఒప్పందం ప్రకారం... అమెరికా, భారత్‌కు అందించాల్సిన నాలుగు పీ8ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. మిగిలిన మూడు పీ8ఐ విమానాలు 2021 ఏడాదికి సిద్ధమవుతాయి. ఈ నాలుగు విమానాల తయారీకి సంబంధించి 2016 జులైలో అమెరికా రక్షణశాఖ, బోయింగ్ కంపెనీతో 1.1 బిలియన్ డాలర్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే భారత్ వద్ద 8 పీ8ఐ విమానాలు ఉన్నాయి.
పొసిడాన్ 8ఐ విశేషాలు...
- అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రోఆప్టిక్ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సాయంతో శత్రు జలాంతర్గాములను దూరం నుంచే ఆయుధాలతో విరుచుకుపడటం ఈ విమానాల ప్రత్యేకత.
- 907 కి.మీ గరిష్ట వేగంతో, 1,200 నాటికల్ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో, ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యంతో ఈ విమానాలు నౌకా దళానికి కీలకంగా మారాయి.
- హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. అలాగే లద్దాఖ్ ప్రాంతంలో గస్తీ కోసమూ వీటిని రంగంలోకి దింపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరిన అత్యాధునిక యుద్ధ విమానం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పొసిడాన్ 8ఐ(పీ8ఐ)
ఎక్కడ : ఐఎన్‌ఎస్ హన్స నౌకా స్థావరం, గోవా
ఎందుకు : భారత సముద్ర నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
జలరవాణా శాఖగా నౌకాయాన శాఖ పేరు మార్పు
ఢిల్లీలో టపాసులపై నిషేధం: ఎన్జీటీ
భారత రాజధాని న్యూఢిల్లీలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నవంబర్ 9న ఆదేశాలు జారీ చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. నిషేధాజ్ఞలు నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్‌కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలు కూడా నిషేధం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు
వారణాసిలో రూ. 614 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9న వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు.
ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో...
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 10న వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
బిహార్ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య?
2020 ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నవంబర్ 10న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా.. ఎన్డీయే 125 చోట్ల విజయం సాధించింది. ఎన్డీయేలోని... బీజేపీ 74, జేడీయూ 43, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి.
మహా కూటమిలో...
విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 110 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. మరోవైపు వాల్మీకినగర్ (బిహార్) లోక్‌సభ ఉప ఎన్నికలో జేడీయూ విజయం సాధించింది.
దుబ్బాకలో బీజేపీ విజయం...
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,65,645 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020 ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : అధికార ఎన్డీయే కూటమి
డిజిటల్ కంటెంట్‌ను ఏ శాఖ పరిధిలోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు?
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ(ఓవర్ ద టాప్) వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నవంబర్ 11న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు.
రూల్స్-1961కు సవరణలు...
ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్-1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్‌మెంట్ రూల్స్-2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది.
అందుకే...
ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్‌లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. దీంతో ఆన్‌లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను సమాచార, ప్రసార శాఖ రూపొందిస్తుంది.
సుప్రీంకోర్టులో పిల్...
ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి డిజిటల్ కంటెంట్
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై నిఘా ఉంచేందుకు...
ఐటీఏటీ ఆఫీస్-కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఒడిశాలోని కటక్‌లో నిర్మించిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను నవంబర్ 11న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... కేంద్రంలో తమ ప్రభుత్వం పన్ను సంస్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. పన్నుల విభాగం ‘టైజం నుంచి ట్రాన్స్ పరెన్సీ’కి మారినట్లు అభివర్ణించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
పన్ను చెల్లింపుదారు-వసూలుదారు మధ్య విశ్వాస రాహిత్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నించింది. పన్ను నిబంధనలు, నిర్వహణా వ్యవహారాలను సులభతరం చేసింది.
- కార్పొరేట్ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది.
- డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును తొలగించింది. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగాలన్నదే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
- రూ.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు దిగువ మధ్య తరగతి యువతకు ఎంతో ప్రయోజనం కల్పిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్-కమ్-రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కటక్, ఒడిశా
షిప్పింగ్ శాఖ పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ
కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు నవంబర్ 11న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నాం. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాలి. నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించిన విషయం తెలిసిందే.
వీజీఎఫ్ పథక విస్తరణ...
సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ నవంబర్ 11న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ పథకం అమలవుతోంది.
జాతీయ విద్యా దినోత్సవం
భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతి సందర్భంగా నవంబర్ 11న దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని(రాష్టీయ్ర శిక్షా దివస్) జరుపుకున్నారు. జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, బహు భాషా ప్రవీణుడు, భారత దేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మౌలానా జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1947, ఆగస్టు 15 నుంచి 1958, ఫిబ్రవరి 2 వరకు దాదాపు 11 సంవత్సరాలపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మౌలానా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ మైనార్టీ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ విద్యా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మౌలానా చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. మౌలానా జయంతిని 2008లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కొత్త చట్టం
ప్రత్యేక కమిషన్ ఏర్పాటు...
ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు.
20 మందికిపైగా సభ్యులు...
ప్రత్యేక కమిషన్ లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్ ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
కమిషన్ ఏం చేస్తుందంటే..
- ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్ కు కట్టబెట్టారు.
- చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది.
- కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది.
- కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.
- కమిషన్ ఆదేశాలను సివిల్‌కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు.
రానున్న పదేళ్లలో ఎన్ని ఆనకట్టలను ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది?
రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో
ఎందుకు :రానున్న పదేళ్లలో736 ఆనకట్టలను ఆధునీకరించాలని
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత శాతం ఆహార ధాన్యాలను జనపనార సంచుల్లోనే నిల్వ చేయాలి?
ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 100 శాతం ఆహార ధాన్యాలను, 20 శాతం పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన అక్టోబర్ 29న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌కమిటీ ఆమోదం తెలిపింది. జౌళి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుంది.
జ్యూట్ ఐకేర్..
జౌళి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్‌స కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : 100 శాతం ఆహార ధాన్యాలను, 20 శాతం పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిల్వ చేయాలి
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : జౌళి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు
చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
రెండు రోజుల గుజరాత్‌పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 30న నర్మద జిల్లాలోని ప్రఖ్యాత ‘ఐక్యతా శిల్పం(స్టాచ్యూ ఆఫ్‌యూనిటీ)’కి దగ్గరలో నాలుగు పర్యాటక ప్రదేశాలను ప్రారంభించారు.
ఆరోగ్య వనం: ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని మొదట ప్రారంభించారు. ఈ ఆరోగ్య వనంలో 380 రకాలకు చెందిన సుమారు ఐదు లక్షల ఔషధ మొక్కలున్నాయి.
ఏక్తామాల్: వివిధ రాష్ట్రాల చేనేత, చేతి వత్తుల ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏక్తామాల్‌నుమోదీ ప్రారంభించారు.
పౌష్టికాహార పార్క్: 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ తరహా టెక్నాలజీ ఆధారిత థీమ్‌పార్క్‌ప్రపంచంలోనే మొదటిదిగా భావిస్తున్నారు. ‘సరైన పోషణ.. దేశానికి వెలుగు’ నినాద స్ఫూర్తితో చిన్నారులను ఆకర్షించే 47 రకాల ఆకర్షణలు ఇందులో ఉన్నాయి.
జంగిల్‌సఫారీ: 375 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘జంగిల్ సఫారీ’నిమోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక జంతు ప్రదర్శన శాలలో పులులు, సింహాలు సహా 100 జంతు, పక్షి జాతులు ఉన్నాయి.
క్విక్ రివ్వూ:
ఏమిటి : నాలుగు పర్యాటక ప్రదేశాలు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు :స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపం, నర్మద జిల్లా, గుజరాత్
భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవాడియాలో భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు తొలి సీప్లేన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 31న ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు.
సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై...
ఐక్యతా విగ్రహం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్-కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది.
రాష్ట్రీయ ఏక్తా దివస్...
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : భారతదేశ మొట్ట మొదటి సీప్లేన్ సేవలు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సర్దార్ సరోవర్ డ్యామ్, కేవాడియా, నర్మదా జిల్లా, గుజరాత్
ఎందుకు : పర్యాటక రంగ అభివృద్ధి కోసం
మాస్క్ దరించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రం?
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి పౌరులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ చట్టం చేయనున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వెల్లడించారు. మాస్క్‌లపై చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రంగా రాజస్తాన్ నిలువనుందని తెలిపారు. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ 31న బిల్లుని ప్రవేశపెట్టారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బిల్లులు...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ అసెంబ్లీ నవంబర్ 2న మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఈ విధమైన బిల్లులను రూపొందించాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, లేదా అంతకన్నా ఎక్కువకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయాలని రాజస్తాన్ ప్రభుత్వం బిల్లుల్లో పేర్కొంది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : మాస్క్ దరించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : రాజస్తాన్
ఎందుకు : కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి
లూహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నవంబర్ 4న జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో సట్లెజ్ నదిపై సిమ్లా, కులు జిల్లాల్లో 210 మెగావాట్లతో లూహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టు(Luhri Stage-I Hydro Electric Project) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1,810 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 758.20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
మరోవైపు వైద్యరంగంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర సహాకార ఒప్పందానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : లూహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : సిమ్లా, కులు జిల్లాలు, సట్లెజ్ నది, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : 758.20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు