Climate Change: వాతావరణ మార్పుల సూచీలో 10వ స్థానంలో భారత్‌..

భూ తాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల నియంత్రణలో ప్రపంచ దేశాల ర్యాంకులను సూచించే వాతావరణ మార్పుల ఆచరణ సూచీ (CCPI-2025) ప్రకారం, భారత్‌ పునరుత్పాదక, శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దిశలో పదో స్థానంలో నిలిచింది.

న‌వంబ‌ర్ 20వ తేదీ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో 60కు పైగా దేశాల ర్యాంకుల జాబితాను విడుదల చేశారు.

పునరుత్పాదక ఇంధనాల ప్రోత్సాహం, శుద్ధ ఇంధనాల విధానాలు అందించిన ప్రాధాన్యం, అలాగే దేశంలో వీటి ఆచరణ పరిశీలనలో భారత్‌ ప్రగతి సాధించినట్లు సీసీపీఐ నిపుణులు గుర్తించారు. అయితే.. భారత్‌ బొగ్గుపై అధికంగా ఆధారపడటాన్ని, ఇంకా ఉద్గారాలను తగ్గించేందుకు మరింత చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే.. భారత్‌కు చెందిన తలసరి ఉద్గారాలు 2.9 టన్నులు మాత్రమే, ప్రపంచ సగటు 6.6 టన్నులు కాగా, భారత్‌ ఈ విషయంలో తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది. భారత్‌ భవిష్యత్తులో పర్యావరణ అనుకూల విధానాలను మరింత వేగంగా అవలంబించాలని సీసీపీఐ సూచించింది.

Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ టాప్‌–10 నగరాలు ఇవే..

రంగుల జాబితాలో..

  • మొదటి మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
  • నాలుగో స్థానంలో డెన్మార్క్‌, నెదర్లాండ్స్.
  • ఐదో స్థానంలో బ్రిటన్‌.
  • చైనా, అమెరికా 55, 57వ స్థానాల్లో నిలిచాయి.
  • శిలాజ ఇంధన ఉత్పత్తి చేసే రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్‌ జాబితాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.

World’s Largest Coral: ప్రపంచంలో అతిపెద్ద పగడం గుర్తింపు

#Tags